రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో అన్న వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తెల్లాపూర్ పరిధిలోని కొల్లూర్, ఈదులనాగులపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
రూ. 1. 93 కోట్లతో కొల్లూర్ డబుల్ బెడ్రూమ్ ఫేజ్ 1 నుంచి ఉస్మాననగర్ మొయిన్ రోడ్డు వరకు స్ర్టీట్ లైటింగ్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు. ఈదులనాగులపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు
